ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాధవరం గ్రామంలో ఏవో ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అధికంగా రసాయనిక ఎరువులు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికంగా రసాయన ఎరువులు వాడటం వలన నేలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆశించిన పంట దిగుబడి రాదని అన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడాలని రైతులు ఖర్చులను తగ్గించుకోవాలని ఎంపీడీవో సత్యం సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.