Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
ఉదయగిరిలోని సీతారాంపురం జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. ఆదివారం సీతారాంపురం నుంచి ఉదయగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును నందిపాడు నుంచి నేలటూరుకు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జెంది. ఈ కారులో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేపట్టారు.