జగిత్యాల, ఆగష్టు 26: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వలు రెండు రైతుల పట్ల ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నాయని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో యూరియా కొరత పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్ చౌరస్తా లో మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ధర్నా చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదన్నారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరత్తనట్లు వ్యవహారిస్తుందని ఆరోపించారు. హామీల అమలు