భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో చెడును ప్రచారం చేసినా శిక్షార్హమేనని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సునీల్ చౌదరి పేర్కొన్నారు. రాజధాని అమరావతి పై అబద్ధపు ప్రచారం-భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై ఏపీ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విజయవాడ గాంధీనగర్ లో జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కూడా పాల్గొన్నారు.