భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై పూర్తిగ వరద నీరు చేరింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివారులోని ఎడ్ల కట్ట వాగు పూర్తిగా నుండి జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో కామారెడ్డి నుండి హైదరాబాదు వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బిక్కనూరు నుండి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ జాతీయ రహదారి బైపాస్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.