సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారులో 65 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ముంబై వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ బీదర్ చౌరస్తా సమీపంలో ముందు వెళ్తున్న మరో లారిని ఢీ కొట్టింది. ప్రమాదంలో లారీలోని క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న NHAI అంబులెన్స్ సిబ్బంది, క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.