జిల్లా ప్రజలు వినాయకుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య కలెక్టరేట్ లోని పరిపాలన వినాయకుని పూజల సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం కలెక్టరేట్ లో ప్రతిష్టించిన పరిపాలన వినాయకునికి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల కు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ వారు సూచించిన శాంతి భద్రతలు పాటిస్తూ పర్యావరణహితంగా వినాయక పండుగ మరియు నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలని కోరారు.ఈ పూజా కార్యక్రమానికి కర్నూలు జిల్లా మరియు పట్టణ గణేష్ ఉత్సవ క