యాడికి మండలం రాయలచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డేనియల్, వెంగన్న పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రెడ్డి లు జిల్లా ఉత్త ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అనంతపురంలో శుక్రవారం ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ హెచ్ ఎం లగా ఎంపికైన డేనియల్, కృష్ణ మోహన్ రెడ్డి లను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జడ్పీ చైర్ పర్సన్ బోయగిరిజమ్మ, డీఈవో ప్రసాద్ బాబు తదితరులు శాలువాలతో సన్మానించారు.