తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచం నలుచెరుగులా వ్యాప్తి చేసిన అన్న ఎన్టీఆర్ కారణజన్ముడని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రావికమతం మండలం కిత్తంపేటలో శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు.. నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్రను తిరగ రాశారని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహిళ పక్షపాతిగా అభివర్ణించారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా టీడీపీని క్రమశిక్షణ గల పార్టీగా తీర్చి దిద్దారన్నారు.