హౌరా-తిరుచిరాపల్లి (12663) సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సూళ్లూరుపేట రైల్వే గేటు వద్ద కొన్ని క్షణాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, పట్టణ ప్రజలు ఆందోళన చెందారు. రైలు గేటు దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ఆక్టివేట్ కావడంతో డ్రైవర్ అత్యవసరంగా రైలును నిలిపివేశారు. వెంటనే రైల్వే సిబ్బంది పరిశీలన చేపట్టి సుమారు 15 నిమిషాల పాటు శ్రమించారు. చివరకు ఎటువంటి సాంకేతిక లోపం లేదని నిర్ధారించడంతో రైలు మళ్లీ బయలుదేరింది. ఈ సమయంలో రైల్వే గేటు మూసి ఉండటంతో ప్రజలు వేచి చూడాల్సి వచ్చింది.