గత పాలకులు విద్యుత్తు రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దీనివల్లే రాష్ట్రంలో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.శుక్రవారం కారంపూడిలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచకుండా ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లపై సూర్య ఘర్ సోలార్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.