సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మండల పరిషత్తు కార్యాలయాల్లో రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు ఓటర్ జాబితాలపై సమావేశం నిర్వహించారు. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం ఎంపీడీవోలు శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నెల 28న గ్రామపంచాయతీ కార్యాలయాలలో వార్డుల వారిగా ఓటర్ జాబితాలను ప్రదర్శించినట్లు తెలిపారు. జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంచాయతీ కార్యదర్శులకు 30వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను అందించవచ్చన్నారు. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీల వార్డుల వారి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.