శ్రీకాకుళం : పార్టీ కోసం కష్ట పడిన వారికీ సాధ్యమైనంత వరకు నామినేటెడ్ పోస్ట్ లు ఇచ్చి గౌరవం ఇస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు. శంకర్ అన్నారు.శ్రీకాకుళం నగరం లో ఉన్న ..శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లో బుధవారం మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాలకు ఆలయ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది... కమిటీ చైర్మన్ గా పాండ్రంకి దేవేంద్ర నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... ఆలయాల్లో దేవుని సేవ చేయాలని ఆసక్తి ఉన్న ఎవరైనా తమకు పేర్లు తెలియజేసినట్లయితే వారిని రిజర్వేషన్ ప్రకారం కమిటీల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు