రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన దండుగుల రాజయ్య అనే వ్యక్తి 20 రోజుల క్రితం గల్ఫ్ దేశంలో గుండెపోటుతో మృతి చెందాడు.ఉపాధి కోసం రాజయ్య షౌది అరేబియా దేశం వెళ్లి గత 7 సంవత్సరాలుగా కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈతరుణంలోనే 20 రోజుల క్రితం గల్ఫ్ లోనే హార్ట్ స్ట్రోక్ తో మరణించాడు.. కాగా ఇరువై రోజుల తర్వాత శనివారం రోజున రాజయ్య మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాజయ్యది నిరుపేద కుటుంబమని ప్రభుత్వ పరంగా వారిని ఆదుకోవాలని వడ్డెర యూత్ సభ్యులు కోరారు.