Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: షాద్నగర్ పట్టణంలో పైప్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Ibrahimpatnam, Rangareddy | Aug 29, 2025
షాద్నగర్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ కాలనీలో అమృత్ స్కీం లో భాగంగా 76 లక్షల రూపాయలతో వేసే పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీవాసులతో మాట్లాడుతూ త్వరలో డ్రైనేజీ విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us