కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడానికి చైర్ పర్సన్ లక్ష్మీదేవి మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి ఫోన్ చేస్తే కమిషనర్ స్పందించలేదంటూ మంగళవారం సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే రసాభాస మొదలైంది. దీంతో కమిషనర్, అధికారులు, టిడిపి కౌన్సిలర్లు సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికి కౌన్సిల్ హాల్ నుంచి వెళ్ళిపోయారు. దీంతో కమిషనర్ చైర్పర్సన్ కు క్షమాపణ చెప్పాలని, తిరిగి కౌన్సిల్ హాల్ కు వచ్చి సభను కంటిన్యూ చేయాలంటూ వైకాపా కౌన్సిలర్లు పట్టుబట్టి రాత్రి కౌన్సిల్ హాల్ లొనే నిద్రపోయారు.బుధవారం ఉదయం కౌన్సిల్ హాల్ లోనే నిరసన తెలియజేస్తూ కూర్చున్నారు.