రైతులకు తప్పని యూరియాతిప్పలు, యూరియా కోసం తోపులాట తూప్రాన్ పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బుధవారం తోపులాట జరిగింది. దీంతో అధికారులు పంపిణీని మధ్యలోనే నిలిపివేశారు. 300 బస్తాల యూరియా లభ్యతపై సమాచారం అందుకున్న రైతులు తెల్లవారుజామునే కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు పంపిణీ ప్రారంభించగానే యూరియా బస్తాల కోసం తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు యూరియా పంపిణీని నిలిపివేశారు.