రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీశక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికుల ర్యాలీ స్త్రీశక్తి పథకంలో భాగంగా ఆటో కార్మికుల ర్యాలీ స్తానిక పెడనలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ శనివారం మధ్యాహం 4 గంటల సమయంలో ఆటో యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. స్థానిక పెడన బస్టాండ్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులకు సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.