కుప్పం మున్సిపాలిటీలో ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరి ఆమోదంతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. కుప్పంను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రీచ్ 4లో భాగంగా కడ కార్యాలయం వద్ద నుంచి క్రిష్ణగిరి సర్కిల్, టీడీపీ కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ చేస్తునట్లు తెలిపారు.