గత రాత్రి సిగరెట్ కోసం ఇంటి నుండి బయటకు వచ్చిన కోరబండి మరియదాసు ను మద్యం ఇప్పించమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అనుచరులు దాడి చేశారని కోరబండి మరియదాసు సోదరి విజయ ఆరోపించారు. ఇదే అంశంపై శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో బాధితుడు కోరబండి మరియదాసు సోదరి విజయ మాట్లాడుతూ గత రాత్రి దాసరిపాలెంలోని సి.ఆర్ కాలనీలో నివాసం ఉండే తన సోదరుడు కోరబండి మరియదాసు సిగరెట్ కోసం అని బయటకి వచ్చిన సమయంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అనుచరుడు సుధీర్ అతని అనుచరులతో కలిసి అడ్డుకొని దాడి చేసినట్లు తెలిపింది.