ప్రజావాణికి 72 దరఖాస్తుల స్వీకరించిన జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం గద్వాల కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 72 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.