ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ కాలనీలో క్షుద్ర పూజల కలకలం రేపింది. అర్ధరాత్రి అమావాస్య కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పటాలు వేసి క్షుద్ర పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కాలనీవాసులు క్షుద్ర పూజలు జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఎవరైనా ఆకతాయిల పైన.. లేదా నిజంగానే క్షుద్ర పూజలు చేశారా తెలియాల్సి ఉంది.