ఈనెల 6వ తేదీన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ల పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు.మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి డబుల్ బెడ్ రూమ్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ గృహాలను సందర్శించారు.