నెల్లూరు కొత్తకాలువ సెంటర్ వద్ద డెడ్ బాడీ నెల్లూరు 1వ డివిజన్ కొత్తకాలువ సెంటర్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ వ్యక్తి గురువారం రాత్రి మద్యం మత్తులో పడిపోయి శుక్రవారం ఉదయం 11 గంటలకు చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.