ముమ్మిడివరం మండలం అనాతవరం పరిధిలోని మునుకోటి వారిపాలెంలో వాసంశెట్టి సత్యనారాయణలో అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం గోధుమ త్రాచుపాము ప్రవేశించింది. దీంతో ఇంట్లోని వ్యక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా బంధించారు.