పెన్షన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం పూర్తిపారదర్శకతతో వ్యవహరిస్తోందనీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వ అస్తవ్యస్త పాలనా విధానంలో భాగంగానే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేశారంటూ మండిపడ్డారు. అప్పటి వైసిపి హయాంలో 757 బోగస్ పెన్షన్లను మంజూరు చేశారని ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు దివ్యాంగులు ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి పెన్షన్లను కొనసాగించాలని కోరారు.