పాణ్యం మండల కేంద్రంలోని చెరువు కట్టలో ఆదివారం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రెవెన్యూశాఖ సిబ్బంది కృషి చేశారు.