శ్రీకాళహస్తిలో శరవేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు శ్రీకాళహస్తిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం నిమిత్తం శివం టు శివం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. చెంబేడు కాలువ గేట్లు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాలువకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా చేపడుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి స్లాబ్ లెవల్కు రావడంతో దాదాపుగా రోడ్డు నిర్మాణ పనులు ఒక దశకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.