హుజురాబాద్: పట్టణంలోని సబ్ స్టేషన్ ఎదురుగా అన్న ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో తమ్ముడు సదానందం శనివారం సాయంత్రం బైటాయించాడు ముగ్గురు అన్నదమ్ముల పొత్తులో ఉన్న ఆస్తిని అమ్మిన తర్వాత అన్న తనకు వచ్చే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు. తన బిడ్డ వివాహం కోసం డబ్బులు ఇవ్వాలని అడిగితే గత నాలుగు నెలల నుండి ఇబ్బందుల గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పురుగుల మందు డబ్బా లాక్కొని న్యాయం చేస్తామని సదానందంలో పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీస్ లు తెలిపారు.