ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని నిర్మామహేశ్వర స్వామి ఆలయం నందు నూతనంగా ఆలయ చైర్మన్ గా వెంకటరామయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించినట్లు వెంకటరామయ్య తెలిపారు. ఆలయ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఈవో నారాయణరెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. చైర్మన్ పదవి రావడానికి కారణమైన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.