ప్రతి విద్యార్థి ఆత్మ రక్షణలో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్ ను నేర్చుకోవాలి: గుడివాడ డిఎస్పి ధీరజ్ నీల్ గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని AGK మున్సిపల్ హై స్కూల్ నందు గుడివాడ డిఎస్పి ధీరజ్ నీల్ ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ J.R.K. హనీష్ బాబు సెల్ఫ్ డిఫెన్స్ నిపుణులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీయ రక్షణ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే విధానాలను సీఐ, నిపుణులు ప్రాక్టికల్‌గా చూపించారు. ప్రత్యేకంగా బాలికలకు స్వీయ రక్షణ అవసరం ఎంత ముఖ్యమో వివరించారు.