బంగారుపాళ్యం పోలీస్టేషన్ లో మంగళవారం మహిళ అదృశ్యం పై కేసు నమోదు చేసినట్లు సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం దిగువ మోదలపల్లి గ్రామానికి చెందిన సుజాత వెంకటేశ్వర్లు కుమార్తె రాధిక(19సం)ఈమె అమ్మమ్మ వాళ్ళ ఊరైన బంగారుపాళ్యం మండలం తంబుగానిపల్లి కి రావడం జరిగింది. సోమవారం మధ్యాహ్నం ఈ అమ్మాయి అదృశ్యం అయింది.అమ్మాయి తల్లి సుజాత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.