ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని శనివారం ఉదయం గంట్యాడ మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఘనంగా నిర్వహించారు. గంట్యాడ బీసీ హాస్టల్ లో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి వసతి గృహ సంక్షేమాధికారి తెన్నేటి సీతారామ శర్మ పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే ఎస్సీ హాస్టల్ లో వసతి గృహ సంక్షేమ అధికారి గొర్లె గోవింద సన్యాసిరావు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహాల విద్యార్థులు పాల్గొన్నారు.