కొత్తపేట నుంచి పలివెల వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని చూసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చలించిపోయారు. కొత్తపేట పలివెల ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చూసిన ఎమ్మెల్యే వెంటనే తన కాన్వాయ్ ఆపి గాయపడిన వ్యక్తిని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధైర్యంగా ఉండాలని క్షతగాత్రుడికి భరోసా ఇచ్చి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అవసరమైతే రాజమండ్రి తరలించాలని సూచించారు.