రైల్వే కోడూరు పట్టణ పరిధిలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని పట్టణ సీఐ సుందర్ రావు సూచించారు. రైల్వేకోడూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు వినాయక మండపాల నిర్వాహకులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. రాత్రి పది తర్వాత మండపం లోని మైకులు ఆపేయాలి అన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని, రాజకీయ ప్రేరేపిత పాటలు, అశ్లీల నృత్యాలు నిషేధమని, రాత్రులు మండపాల వద్ద కాపలా ఉండాలన్నారు.