మన్సురాబాద్ పెద్ద చెరువు కొలనులో నిమజ్జనానికి కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా ఏర్పాట్లను కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద చెరువు కొలను ప్రాంగణంలో నిమజ్జనం సాఫీగా నిర్వహించేందుకు అధికారులతో మరియు పోలీసులతో కలిపి కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం సిఐ మహేష్ గౌడ్ పాల్గొన్నారు.