ఈ నెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొనేందుకు నస్పూర్ మండల కేంద్రంలోని సింగరేణి అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావును ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి. భాస్కర్, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా పౌరసంబంధాల అధికారి కృష్ణమూర్తి, ఎసిపి ప్రకాష్, తహశిల్దార్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.