ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా అక్రమ నిల్వలను నివారించాలని రైతులకు సరిపడా ఎరువులను అందించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ యస్ వి త్రివినాగ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ ఎరువుల కొరత లేకుండా చూడాలని యూరియా బ్లాక్ మార్కెట్కు తరలించకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.