శ్రీకాళహస్తిలోని సన్నిధి వీధి దేవస్థానానికి సమీపంలో గుర్తు తెలియని యాచకురాలు మృతి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, దేవస్థానం సిబ్బంది మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె ముఖంపై గాయాలు ఉండటంతో కిందపడి మరణించి ఉంటుందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.