జనగామ పట్టణంలోని బాలాజీ నగర్ లో వినాయక మిత్ర బృందం ఆధ్వర్యంలో నెలకొల్పిన మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తున్నారు.భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రతి రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఆదివారం 5వ రోజు మహిళలు సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం వినాయకుడి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వచనం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.