నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ ఏఈఓ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, వేద పండితులు రవిశంకర్ అవధాని ఆదివారం ఆలయాల తలుపులను మూసివేశారు. ఏ ఓ మాట్లాడుతూ.. ఈరోజు మధ్యాహ్నం నుంచి దైవ దర్శనం నిలిపివేశారన్నారు. సోమవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం మూసివేసిన ఆలయ తలుపులు తెరుస్తామని తెలిపారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.