సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని కేవల్ కిషన్ భవన్ లో విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభ గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బషీర్బాగ్ లో నిరసన తెలుపుతున్న వారిని గత ప్రభుత్వం కాల్పులు జరపడంతో మృతి చెందారని దీంతో విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అతిమేల మాణిక్, యాదగిరి, కృష్ణ, నర్సింలు, తదితరులు ఉన్నారు