తిరుపతి జీవకోన జీవ లింగేశ్వర స్వామి ఆలయం దగ్గర శనివారం అర్ధరాత్రి ఎలుగుబంటి సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఇప్పటికే తిరుపతి పరిసర అటవీ ప్రాంతాల్లో అడవి మృగాల సంచారం ఎక్కువ అవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం విధితమే . ఇప్పుడు ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.