నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో చెంచు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు, ఐటీడీఏ లో జీవో నెంబర్ 74 ప్రకారం చెంచులు ఆదివాసులకు టీచర్ జాబ్ కోసం ఇచ్చినారు కానీ 2025 డీఎస్సీలో ఆదివాసీలు చెంచుల టీచర్ ఉద్యోగాలు జనరల్ డీఎస్సీలో కలపడం వల్ల చెంచులకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని చెంచు నిరుద్యోగులు వెంకటేశ్వర్లు ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో చెంచు నిరుద్యోగులు సవరయ్య, నడిపి సుంకన్న, రాముడు రంగస్వామి అశ్విని తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.