సమిష్టిగా కృషి చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెంకటాపురం డివిజన్ లోని చిత్తారయ్య, రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రజితోత్సవ వేడుకల్లో భాగంగా 3.42 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ కూడా పాల్గొన్నారు. మల్కాజిగిరి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు.