సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో అందోల్ పెద్ద చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందోల్ చెరువు కట్టను మినీ ట్యాంక్ పండుగ ఏర్పాటు చేసి చెరువులో బోటింగ్ సదుపాయాన్ని కల్పించి ఇతర వినోదాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట నున్నట్లు తెలిపారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చెరువు కట్టను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలంటూ మంత్రి దామోదర్ అధికారులకు సూచించారు.