బస్తీ దవాఖాన ద్వారా నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ తో కలిసి కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడ బస్తీ దవాఖానను సందర్శించి బస్తీ దవాఖానాలో అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి వైద్యులు మరియు వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.