Parvathipuram, Parvathipuram Manyam | May 19, 2025
పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి గ్రామ సమీపంలో ఉన్న గెడ్డలో స్నానానికి దిగిన నూజివీడు కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నూజివీడు నుండి పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి గ్రామానికి పెళ్లికై వచ్చిన ఐదుగురు విద్యార్థులు సోమవారం సాయంత్రం గెడ్డలో స్నానానికి దిగారు. అందులో ఇద్దరు విద్యార్థులకు ఈత రాకపోవడంతో బొత్స ఈశ్వర రావు (16), నాగిరెడ్డి సాయి ( 16 ) మృతి చెందినట్లు తెలిపారు. మిగతా ముగ్గురుని స్థానికులు కాపాడినట్లు పేర్కొన్నారు.