మాచర్ల బ్యాంకులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 9 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసి, దొంగిలించిన రూ.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 62 గ్రాముల బంగారాన్ని విక్రయిస్తామని నమ్మించి, మంగళగిరికి చెందిన మహేశ్ నుంచి ఈ ముఠా డబ్బును కాజేసింది. నిందితుల్లో కొందరికి గుంటూరులో పలు కేసులు ఉన్నాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.