మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకులభావి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తూప్రాన్ వెళుతున్న కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ను ఢీకొని, గుంతల్లో పల్టీ కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రమేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని బయటకు తీసి 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రమేష్ ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని కాసిం భాయ్ తండాకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు.